Home ఆరోగ్యం ఆ.. స‌మ‌యంలో ఒత్తిడి వ‌ద్దు

ఆ.. స‌మ‌యంలో ఒత్తిడి వ‌ద్దు

ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడికి గురవ్వడం మంచిది కాదు. అందుకే ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ పద్ధతుల్ని పాటించాలి. కారణం లేకుండా ఎలాంటి ఒత్తిడీ దరి చేరదు.అందుకే ముందుగా దానికి కారణం ఏంటో గుర్తించాలి. ఒకవేళ ఆ సమస్యని పరిష్కరించుకోవడం మీవల్ల కాకపోతే ఇతరుల సహాయం తీసుకునేందుకూ వెనుకాడ‌కూడదు.ఒంటరిగా ఉంటే ర‌క‌రకాల ఆలోచనలు కలుగుతుంటాయి.

అందుకని నలుగురిలో ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించాలి.ఇంట్లోని పరిస్థితులు, బాధ్యతలే మీ ఒత్తిడికి కారణమైతే కొన్నిరోజులపాటు వాటన్నింటికీ దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు న‌డ‌వండి. సాయంత్రంపూట ఆరు బయట కాసేపు నడవండి.ఐతే..వ్యాహ్యాళి మొదలుపెట్టేటప్పుడు వైద్యుల సలహా తప్పనిసరి అన్న సంగ‌తి గ్ర‌హించండి.సంగీతం వినడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

కానీ అదే పనిగా రోజంతా సంగీతం వినడం కూడా.. ఆరోగ్యానికి ఏమంత మేలు కాదు.ఒక‌వేళ మీకు సరైన పోషకాలు అందకపోయినా ఒత్తిడి పెరుగుతుంది.అందువ‌ల్ల గ‌ర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.ఒత్తిడి అధికంగా అనిపించినప్పుడు వెనువెంట‌నే వైద్యుల్ని సంప్రదించ‌డం మ‌రువ‌ద్దు.

Related Articles

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని...

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే...

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే… వారి...

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే!...