ప్రతి ఒక్కరి జీవితంలో వివాహబంధం చాలా ముఖ్యమైనది. చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది కూడా. వివాహం అంటే కేవలం శారీరక తోడు కోసమే కాదు.. జీవితాంతం తోడునీడగా,, కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలో సాయపడుతుంది. ఒడిదుడుకులకు ఒకరికి ఒకరు సహాయపడతారు. కానీ ఈ వివాహం ఒక నిర్ణీత వయసులో చేసుకుంటేనే జీవితం సార్థకమవుతుంది. ఎంతో అన్యోన్యతతో పాటు చాలా ఎక్కువ కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలాసాఫీగా సంసార నావ ఒడ్డుకు చేరుతుంది.
అయితే ఈరోజుల్లో అతి చిన్న వయసుల్లో ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం, చిన్న చిన్న కారణాలతో మనస్పర్థలు వచ్చి తమ వైవాహిక జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఈ పొరపాటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ముఖ్యమైనది వయసు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటే ఎక్కువకాలం సుఖమయంగా జీవితాన్ని గడపవచ్చు. అలాకాకుండా ఎటూకాని వయసులో అంటే ముందుగానో లేక లేటు వయసులోనే పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు వస్తాయి. వివాహ బంధంపై అవి చూపుతాయి. అయితే ఆ వయసు ఎంత ఉండాలో తెలుసుకుందామా..
దేశంలో ఎనిమిదేళ్ల ఏళ్ల పాటు నిర్వహించిన సర్వే ప్రకారం 28-32 ఏళ్ల మధ్య వయసున్నవారు వివాహం చేసుకుంటే చాలా చక్కగా, జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చట. ఈ వయసులో ఉన్నపురుషులు, స్త్రీలు చాలా పరిణితి చెంది ఉంటారట. ఈ పరిణితి వల్ల జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తట్టుకుని నిలబడే మనస్తత్వం ఏర్పడుతుందట. వైవాహిక జీవితానికి ఇబ్బందులు లేకుండా సమస్యలను అధిగమించే ధీమా వస్తుందని 28-32 ఏళ్ల వయసు వివాహానికి సరైన సమయం అని పరిశోధనలో తెలియజేశారు. సో.. మీరు కూడా ఈ వయసులోనే పెళ్లి చేసుకుని జీవితం ఎంజాయ్ చేయండి.