Home తెలుగు స్పెషల్ తాగుబోతులారా! అదిగో న‌వ‌లోకం …

తాగుబోతులారా! అదిగో న‌వ‌లోకం …

drinkers-world-telugu24x7

కొన్నంతే వినేందుకు వింత‌గా ఉంటాయ్‌.చూస్తే ఆశ్చ‌ర్యంగొలుపుతాయ్‌.స‌రిగ్గా ఇదే కోవ‌లోకి చెందిన‌వీ బార్లు.పేరుకు ఇవి బార్లే అయిన‌ప్ప‌టికీ వీటికో ప్ర‌త్యేక ల‌క్ష‌ణం ఉంది. అదేంటంటే ఇక్క‌డికి వెళ్లి ప్ర‌కృతి సోయ‌గాల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. తాగుతూ..తూలుతూ.. ఆహ్లాద‌క‌రం వాతావ‌ర‌ణంలో ఎంచ‌క్కా కాలాన్ని క‌రిగించ‌వ‌చ్చు. సంతోష‌పు అంచుల‌ను తాక‌వ‌చ్చు.ఇంకా ఏవేవో.. ఎన్నొన్నో చేయ‌వ‌చ్చు.

lebua sky bar

స్కై బార్‌
బ్యాంకాక్‌లోని లిబువా ఏరియాలోని కొలోజల్‌ స్టేట్‌ టవర్‌లోని 63వ అంతస్తులో స్కైబార్‌ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉండే బార్‌. పేరుకు తగినట్లే ఆకాశం వీధిలో ఉన్నట్లు అక్కడ ఉండే జనాలు అనుభూతి చెందుతారు. బార్‌లోంచి చూస్తే ఓ వైపు ఎల్‌యిడీ కాంతుల్లో నగర అందాలు, మరో వైపు హొయలు పోయే నదిని చూస్తూ పెగ్‌ కొట్టొచ్చు. ప్రతీ 90 సెకన్లకో సారి ఈ బార్‌ కలర్‌ మారేట్లు లైట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ త‌ర‌హా బార్‌లో ఒక్కసారైనా కాలు పెట్టాలనే కోరికతో చాలా మంది విదేశీయులు ఇక్క‌డికి వ‌స్తుంటారు.అక్కడి రాజభోగాలకు తగినట్లు పర్స్‌ కూడా ఖాళీ చేసుకోవచ్చట! ఏదైతేనేం అమెరికా, యూరప్‌లో కూడా ఈ స్కైబార్‌కు వీరాభిమానులున్నారట!

SEVVA in Hong Kong- luxurious restaurant and terrace bar

స్కైబారా మజాకా!
సైవా బార్‌
తూర్పున ఉన్న కమర్షియల్‌ హబ్‌గా పేరు గాంచిన హాంగ్‌కాంగ్‌లో సైవా బార్‌ ప్రత్యేకమైనది. 25వ అంతస్తులో ఉండే ఈ బార్‌ కట్టడం అద్భుతంగా ఉంటుంది.అందులో వాడే ఫర్నిచర్‌, సోఫాల దగ్గర్నుంచి ప్రతి ఒక్క‌టీ వినూత్నంగా ఉంటుంది.ఈ బార్‌ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ కూర్చుని 360 డిగ్రీల్లో సముద్రాన్ని చూడొచ్చు. ఈ ప్రత్యేకతతోనే సైవా బార్ సంద‌ర్శ‌కుల‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.

aer bar mumbai

ఎయిర్‌ బార్‌
ఈ బార్‌ ముంబైలో ఉంది. 34 వ అంతస్తులో ఉండే ఈ బార్‌ నుంచి విహంగ వీక్షణం చేస్తే నగరం అంతా కనిపిస్తుంది. ఇందులో ఉండే వైట్ ఫర్నిచర్‌, డార్క్‌ ఫ్లోర్‌ అదనపు ఆకర్షణ. చదువుతుంటేనే మత్తెక్కిపోతోంది కదూ!

Related Articles

పెళ్లికి వాస్త‌వంగా ఉండాల్సిన వ‌య‌సెంతో తెలుసా ..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే...

ఒళ్లంతా థ్రిల్లింత.. ఒక్క కౌగిలింత

కౌగిలింత.. మ‌న‌సుకు థ్రిల్‌. ఇంకా చెప్పాలంటే అదో అంద‌మైన ఫీల్‌.క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా కౌగిలింతే...

చనిపోవడానికి గ‌ది దొరికే హాస్ట‌ల్‌

జీవితం ఒక్క‌టే.. అదీ జీవించేందుకే. కానీ వార‌ణాసిలో ఉన్న ముక్తి భ‌వ‌న్ లో మ‌ర‌ణించేందుకు సిద్ధంగా...