తెలుగు స్పెషల్

తాగుబోతులారా! అదిగో న‌వ‌లోకం …

కొన్నంతే వినేందుకు వింత‌గా ఉంటాయ్‌.చూస్తే ఆశ్చ‌ర్యంగొలుపుతాయ్‌.స‌రిగ్గా ఇదే కోవ‌లోకి చెందిన‌వీ బార్లు.పేరుకు ఇవి బార్లే అయిన‌ప్ప‌టికీ వీటికో ప్ర‌త్యేక ల‌క్ష‌ణం ఉంది. అదేంటంటే ఇక్క‌డికి వెళ్లి ప్ర‌కృతి సోయ‌గాల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. తాగుతూ..తూలుతూ.. ఆహ్లాద‌క‌రం వాతావ‌ర‌ణంలో ఎంచ‌క్కా కాలాన్ని క‌రిగించ‌వ‌చ్చు. సంతోష‌పు అంచుల‌ను తాక‌వ‌చ్చు.ఇంకా ఏవేవో.. ఎన్నొన్నో చేయ‌వ‌చ్చు.

స్కై బార్‌
బ్యాంకాక్‌లోని లిబువా ఏరియాలోని కొలోజల్‌ స్టేట్‌ టవర్‌లోని 63వ అంతస్తులో స్కైబార్‌ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తులో ఉండే బార్‌. పేరుకు తగినట్లే ఆకాశం వీధిలో ఉన్నట్లు అక్కడ ఉండే జనాలు అనుభూతి చెందుతారు. బార్‌లోంచి చూస్తే ఓ వైపు ఎల్‌యిడీ కాంతుల్లో నగర అందాలు, మరో వైపు హొయలు పోయే నదిని చూస్తూ పెగ్‌ కొట్టొచ్చు. ప్రతీ 90 సెకన్లకో సారి ఈ బార్‌ కలర్‌ మారేట్లు లైట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ త‌ర‌హా బార్‌లో ఒక్కసారైనా కాలు పెట్టాలనే కోరికతో చాలా మంది విదేశీయులు ఇక్క‌డికి వ‌స్తుంటారు.అక్కడి రాజభోగాలకు తగినట్లు పర్స్‌ కూడా ఖాళీ చేసుకోవచ్చట! ఏదైతేనేం అమెరికా, యూరప్‌లో కూడా ఈ స్కైబార్‌కు వీరాభిమానులున్నారట!

స్కైబారా మజాకా!
సైవా బార్‌
తూర్పున ఉన్న కమర్షియల్‌ హబ్‌గా పేరు గాంచిన హాంగ్‌కాంగ్‌లో సైవా బార్‌ ప్రత్యేకమైనది. 25వ అంతస్తులో ఉండే ఈ బార్‌ కట్టడం అద్భుతంగా ఉంటుంది.అందులో వాడే ఫర్నిచర్‌, సోఫాల దగ్గర్నుంచి ప్రతి ఒక్క‌టీ వినూత్నంగా ఉంటుంది.ఈ బార్‌ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ కూర్చుని 360 డిగ్రీల్లో సముద్రాన్ని చూడొచ్చు. ఈ ప్రత్యేకతతోనే సైవా బార్ సంద‌ర్శ‌కుల‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఎయిర్‌ బార్‌
ఈ బార్‌ ముంబైలో ఉంది. 34 వ అంతస్తులో ఉండే ఈ బార్‌ నుంచి విహంగ వీక్షణం చేస్తే నగరం అంతా కనిపిస్తుంది. ఇందులో ఉండే వైట్ ఫర్నిచర్‌, డార్క్‌ ఫ్లోర్‌ అదనపు ఆకర్షణ. చదువుతుంటేనే మత్తెక్కిపోతోంది కదూ!

tadmin

Recent Posts

రైస్ డ్రింక్ తాగి బ‌రువు త‌గ్గండి ఇలా..

ఏమిరా.. బ‌రువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం త‌గ్గించ‌రా అని పెద్ద‌వాళ్లు మించిన బ‌రువుతో క‌ష్టంగా న‌డుస్తున్న‌వారిని చూసి అంటుంటారు. అన్నం…

10 months ago

సెక్స్‌లో ఆ రేంజ్ సుఖానికి 5 టిప్స్‌

ప్ర‌తి మ‌గ‌వాడు సెక్స్‌లో పూర్తిస్థాయి సంతృప్తిని పొందాల‌ని ఆకాంక్షిస్తాడు. సాధార‌ణంగా మ‌గ‌వారికి ఆడ‌వాళ్ల‌ను న‌గ్నంగా చూస్తే చాలు త్వ‌ర‌గా మూడ్…

10 months ago

వీడియో: ఆర్టీసీ బస్సు పైభాగం పైకి లేచింది.. కానీ డ్రైవర్

మరోవైపు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ…

10 months ago

పెళ్లికి వాస్త‌వంగా ఉండాల్సిన వ‌య‌సెంతో తెలుసా ..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివాహ‌బంధం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది కూడా. వివాహం అంటే కేవ‌లం శారీర‌క తోడు…

10 months ago

జాగింగ్ కంటే సెక్స్ వెయ్యిరెట్లు బెట‌ర్ !

దంప‌తుల మ‌ధ్య బంధంగా మ‌రింత పెర‌గాలంటే.. వారి మ‌ధ్య అన్యోన్య‌త మ‌రింత ధృడంగా ఉండాలంటే... వారి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం,…

10 months ago

బీరు తాగితే.. ర‌తిలో..రెచ్చిపోవ‌చ్చా!

సాధారణంగా మద్యం తాగినవారు అన్ని విషయాల్లోనూ తామే బెస్ట్‌ అని భావిస్తుంటారు.ఇలా భావించడం ఒకందుకు మంచిదే! ఈ త‌ర‌హా ఆలోచ‌న..…

11 months ago